చిరంజీవితో నయన్‌ జోడి

Nayanatara To Act In Chiru 150th Film

02:25 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Nayanatara To Act In Chiru 150th Film

మెగాస్టార్‌ చిరంజీవి 150 వచిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. చిరు 150వ చిత్రం ఎప్పుడా అని ఎదురుస్తూన్న చిరంజీవి అభిమానులకు ఒక శుభవార్త. తమిళంలో సూపర్ హిట్‌ అయిన కత్తి సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా వి.వి.వికాయక్‌ స్క్రిప్ట్‌ లో మార్పులతో కధను సిద్దం చేసాడు. ఈ 150 వ సినిమాను మొదలు పెట్టడానికి మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నిర్మాత రామ్‌చరణ్‌ కూడా మొదలు పెట్టడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా లోని ముఖ్య పాత్రలకు నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు . అన్నీటికంటే ముందు కధానాయిక పైనల్‌ అయ్యిందని సమాచారం. మెగాస్టార్‌ రీఎంట్రీ సినిమా కావడంతో మంచి అవగాహన ఉన్న హీరోయిన్‌ అవసరం. ఈ సినిమా కధాంశం ప్రకారం నయనతార కధానాయికగా పాత్రకు న్యాయం చెయ్యగలదని వి.వి.వినాయక్‌ ఉద్దేశం. అందుకే కధానాయికగా నయన్‌ ను ఫైనల్‌ చేశారు. బాలకృష్ణ-వెంకటేష్‌-చిరంజీవి హీరోలకు తగిన హీరోయిన్‌ కాబట్టి నయన్‌ ను సెలెక్ట్‌ చేసారు . ఇంకా కధలో ఉన్న ముఖ్యమైన పాత్రలకు తగిన నటులను ఎంపిక చెయ్యవలసి ఉంది.

English summary

Nayanathara to be acrt as heroine in chiranjeevi 150th film. This movie was going to be directed by V.V.Vinayak