మళ్లీ 'మయూరి' తరహాలో నయన్‌!

Nayanathara signed for another Horror movie

03:27 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Nayanathara signed for another Horror movie

ఈ సంవత్సరం ''మయూరి'' (తమిళంలో మాయ) చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న నయనతార మళ్లీ అదే తరహా సినిమా వైపు అడుగులు వేస్తుంది. అప్పట్లో 'విఠల్‌ ఆచార్య' రూపొందించిన 'జగన్మోహిని'' చిత్రం కూడా హరర్‌ కామెడీనే. ఇప్పుడు దర్శకులు ఈ కాలం నేటివిటికి అనుగుణంగా మార్చి తీసి సక్సెస్లు పోందుతున్నారు. రజనీకాంత్‌ 'చంద్రముఖి'తో ప్రారంభమయిన ఈ ధోరణి ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారిగది, మయూరి చిత్రాల వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. మళ్లీ అదే తరహాలో సినిమా చెయ్యడానికి నయన అంగీకరించింది. 'కళవాణి' ఫేమ్‌ సర్కునమ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అతని శిష్యుడు దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఆ కథని విన్న నయనతార ఆశ్చర్యానికి లోనయిందట. ఇంత మంచి కథని ఇన్ని రోజులు మిస్ చేసుకున్న తను వెంటనే ఈ చిత్రం చెయ్యడానికి సంతకం చేసేసిందిట. స్టార్ హీరోలు, నవతరం నాయకులు అని తేడా లేకుండా జెట్స్పీడ్ తో నయనతార వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

English summary

Nayanathara signed for another Horror movie. And movie is going to direct by Daas.