ఎడమొగం ... పెడమొగం ... అయినా మళ్లీ జోడీ కట్టారు...

Nayanthara and Simbu to act together again

03:11 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Nayanthara and Simbu to act together again

కలవడం విడిపోవడం అటు టాలీవుడ్ లో గానీ, ఇటు బాలీవుడ్ లో గానీ షరామామూలే .. ఇప్పుడు ఈ జంట విషయంలో అదే జరిగింది. ‘వల్లవన్’ (తెలుగులో వల్లభ) చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడిన శింబు - నయనతార... ఆ సినిమా విడుదలైన కొన్నాళ్లకే విడిపోయారు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవ్వడంతో ఆ తరువాత ఇద్దరూ కలిసి నటించేందుకు ససేసిమిరా అన్నారు. కనీసం మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే శింబు - నయనతారలతో ‘ఇదు నమ్మ ఆళు’ తెరకెక్కించి దర్శకుడు పాండిరాజ్ సంచలనం సృష్టించారు.

గత నెలాఖరున విడుదలైన ఈ చిత్రంలో ఇద్దరికీ పెళ్లి సీను కూడా వుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. కొంతకాలంగా హిట్లు లేక సతమతమవుతున్న శింబుకు ‘ఇదు నమ్మ ఆళు’ రిలీఫ్ ఇచ్చింది. ఇందుకు ప్రధాన కారణం నయనతార జోడీగా నటించడమే అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వీరిద్దరితో మరో సినిమా తీయాలని తమిళ దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, మీరిద్దరూ తెరపై కలిశారు, నిజ జీవితంలోనూ మళ్లీ కలుస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... నిజ జీవితంలో కష్టం గానీ, తెరపై మళ్లీ కలిసి నటించే అవకాశం ఉందని అన్నారట. ఏమో ఏం చెప్పగలం..ఇద్దరూ అలా కలసినా ఆశ్చర్యపోనవసరం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:మంచు మనోజ్ మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చిన అఖిల్.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఇవి కూడా చదవండి:'అ..ఆ..' సరైనోడును క్రాస్ చేసేసిందా?

English summary

We all well know that Heroine Nayanatara and Simbu were Ex-Lovers and they fallen in love each other ina movie named Vallabha and later they two were separated and now they two acted in a Tamil Film and that movie was super hit at the box office and now the producers and Director of that film were trying to make a film with these two once again.