సింగపూర్ లో నయనతార- శివన్ ఏం చేశారు?

Nayanthara and Vignesh Shivan at Singapore

11:24 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Nayanthara and Vignesh Shivan at Singapore

రూమర్స్ నడుస్తూనే ఉన్నాయని వదిలేస్తే, అవి నిజం అవుతాయి. అంతేకాదు ఒక్కోసారి తట్టుకోలేని ఇబ్బందులు తెచ్చి పెడతాయి. హీరోయిన్ నయన తార విషయంలో తరచూ ఇదే జరుగుతోంది. దీనికి తోడు ఎవరితో జట్టు కట్టినా కల్సి రావడం లేదు. ఇక తాజాగా నయనతార- విఘ్నేష్ శివన్ గురించి కొత్తన్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. త్వరలో వీళ్లిద్దరు మ్యారేజ్ చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా మళ్లీ కోడై కూస్తోంది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి.. ఇప్పుడొస్తున్న రూమర్ల వెనుక మతలబు ఏంటో? గానీ సైమా అవార్డ్స్ కోసం నయనతార- శివన్ లు కలిసి సింగపూర్ ఎయిర్ పోర్టు దిగి హోటల్ కి వెళ్లే క్రమంలో బయటకు వచ్చిన పిక్ ఇది. ఎట్ ప్రజెంట్ ఈ స్టిల్ సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తోంది. దీంతో ఇద్దరు కలిసి వెళ్లడం కారణమేంటి అంటూ తమిళతంబీలు ప్రశ్నిస్తున్నారట.

గతంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి నయన్ ఓ కారు గిఫ్ట్ గా ఇచ్చిందని, ఇద్దరూ మాల్దీవుల్లో షికార్లు చేశారనే వార్తలు వచ్చినా, ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదంటూ నాయనా కొట్టిపారేసింది. ఇక తమ మధ్య పరిచయం తప్ప అటువంటిదేమీ లేదని శివన్ కూడా మీడియాకు క్లారిటీ ఇచ్చాడట.ఇక లేటెస్ట్ గా సింగపూర్ లో ఇలా కనిపించడంతో మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈసారైనా నయన- శివన్ లు నిజం చెబుతారో లేక దీనికి కూడా ఓ కధ అల్లేస్తారో అంటూ సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి: అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

English summary

Heroine Nayanthara and Vignesh Shivan at Singapore for SIIMA Awards Function.