లిప్ లాక్ కి ఎక్స్ట్రా 50 లక్షలు బాదిన నయన్

Nayanthara charged extra 50 lakhs for liplock

05:27 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Nayanthara charged extra 50 lakhs for liplock

'చంద్రముఖి' చిత్రంతో అటు తమిళం ఇటు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ తరువాత స్టార్ హీరోల సరసన జత కట్టి స్టార్ హీరోయిన్ అయిపొయింది.. ఆ తరువాత కెరీర్ కాస్త స్లో అయినా మళ్లీ ఇప్పుడు కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ శింబుకి-న‌య‌న‌తార‌కు దశాబ్ధం క్రితం న‌డిచిన హాట్ ల‌వ్‌స్టోరీ అప్ప‌ట్లో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా చక్కెర్లు కొట్టింది. అయితే ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రి మ‌ధ్య మనస్పర్ధలు రావడం, వారు విడిపోవ‌డం జ‌రిగాయి. ఈ ప‌దేళ్ల కాలంలో శింబు మ‌రో హీరోయిన్ హ‌న్సిక‌తో కూడా ప్రేమ‌లో ప‌డ‌డం.. త‌ర్వాత వారి ప్రేమ కూడా బ్రేక‌ప్ అవ్వ‌డం జ‌రిగాయి.

ప్రస్తుతం శింబు కెరీర్ పూర్తిగా గాడిత‌ప్ప‌గా.. న‌య‌న‌తార మాత్రం సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప‌దేళ్ల క్రితం 'వ‌ల్ల‌భ' సినిమాలో శింబు-న‌య‌నతార చేసిన హాట్ రొమాన్స్ అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్‌. అయితే త‌ర్వాత జీవితంలో ఇంక శింబుతో కలిసి నటించనని నయనతార ఖరాఖండీగా చెప్పేసింది. అయితే దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ శింబుతో కలిసి రొమాన్స్ చేయడానికి నయనతార సిద్ధం అయింది. ఈ ఇద్దరు కలిసి నటించిన తాజా చిత్రం 'ఇదు నమ్మా ఆలు'. ఈ చిత్రం ఈ నెల 20న తమిళంలో విడుదలవుతుంది. అదే రోజు విశాల్ ది 'రాయుడు' కూడా విడుదలవుతుంది.

'ఇదు న‌మ్ము ఆలు' చిత్రంలో నయనతార-శింబు ల మధ్య ఓ హాట్ లిప్ లాక్ సన్నివేశం ఉందట. మొదట్లో ఆ సన్నివేశం చేయడానికి ఇష్టపడని నయనతార తరువాత 50 లక్షలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని లిప్ లాక్ సన్నివేశంలో చెయ్యడానికి ఒప్పుకుందట. ఈ హాట్ లిప్ లాక్ సన్నివేశం సినిమాకే హైలెట్ అవ్వ‌డంతో త‌మిళ‌నాడులో ఇదు న‌మ్ము ఆలు చిత్రానికి భారీగా క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమా ఎంత వరకు హిట్ అవుతుందో చూడాలి..

English summary

Nayanthara charged extra 50 lakhs for liplock. Hot kollywood beauty Nayanthara charged extra 50 lakhs for liplock with Simbu.