విక్రమ్ తో లిప్ లాక్, హాట్ సీన్స్‌‌లో రెచ్చిపోయిన నయన్

Nayanthara doing very hot scenes in Iru Mugan movie

04:06 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Nayanthara doing very hot scenes in Iru Mugan movie

క్రేజీ హీరోయిన్ నయనతార దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌ లలో ఒకరుగా వెలుగొందుతోంది. స్టార్ హీరోలకు సమానంగా ఓ హీరోయిన్ ఇమేజ్ ఉందంటే అది కేవలం నయన్‌కు మాత్రమేనని చెప్పక తప్పదు. అయితే కొంతకాలంగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నయనతార ఇప్పుడు మరోసారి రొమాన్స్‌తో రెచ్చిపోయేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ విషయం ఏమంటే, ప్రస్తుతం విక్రమ్ సరసన 'ఇరు ముగన్' సినిమాలో నటిస్తున్న నయన్ రొమాన్స్‌ విషయంలో ఇరగదీస్తుందట. ఇక ఈ సినిమాలో లెక్క లేనన్ని లిప్ లాకులు, హాట్ సీన్స్‌‌ తో కుర్రకారును మత్తెక్కిస్తోందట.

తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫాంలో ఉన్న నయనతార చాలా రోజుల తర్వాత గ్లామర్ పాత్ర చేస్తున్న సినిమా కావడం చేత 'ఇరు ముగన్' సినిమా కోసం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇదిలా వుండగా ఈ ఫిల్మ్‌కి సంబంధించి నాలుగు ఫోటోలను యూనిట్ సభ్యులు ఇటీవలే రిలీజ్ చేశారు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మే చివర్లో రిలీజ్ చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. వీటిని చూసిన కోలీవుడ్ జనాలు నయన్-విక్రమ్ కెమిస్ట్రీ అదురహో అని కితాబు ఇచ్చేస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాతో విక్రమ్ ఖచ్చితంగా హిట్ కొట్టేస్తాడని కూడా నమ్మకంగా చెబుతున్నారు.

పైగా ఈ సినిమాలో విక్రమ్ గెటప్, ఫారిన్ లొకేషన్ అబ్బో సూపర్బ్ అని సినీ జనాలు మెచ్చేసుకుంటున్నారు. మొత్తానికి లేటెస్ట్ ఫోటోలతో ఈ సినిమా పై ఇండస్ట్రీలో అమాంతం అంచనాలు పెరిగాయి. మరి ఎలాంటి సంచలన సృష్టిస్తుందో మరి.

English summary

Nayanthara doing very hot scenes in Iru Mugan movie. South Indian hot beauty Nayanthara doing liplocks and hot scenes in Iru Mugan movie with Vikram. This movie is directing by Anand Shankar.