నయనతార మళ్లీ లవ్ లో ఫెయిల్ అయిందా?

Nayanthara fails again in love

10:45 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Nayanthara fails again in love

ఒకసారి అయితే పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ అంటే ఇబ్బందే కదా. ఇప్పుడు నయనతార విషయంలో అదే జరిగింది. ఈ అమ్మడుకి ప్రేమ అస్సలు అచ్చి రావడంలేదు. ఎంతమందిని ప్రేమించినా... ఏదో ఒక విధంగా తేడా వచ్చేస్తోంది. చివరికి ఆమె ఒంటరిగానే మిగిలిపోతోంది. మొదట శింబుతో ప్రేమాయణం నడిపింది. వారిద్దరి లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో బానే హల్ చల్ చేసింది. అయితే అది బెడిసికొట్టి, వారిద్దరూ విడిపోయారు. ఆతర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుని తన చివరి సినిమా శ్రీరామరాజ్యమని చెప్పేసింది.

ఆ సినిమా షూటింగ్ చివరి రోజు కన్నీళ్లతో అందరికి బై చెప్పింది. ప్రభుదేవా కోసం ఇంట్లోంచి కూడా వచ్చేసింది. ఇన్ని చేసినా వారిద్దరి బంధం పెళ్లి పీటలకు చేరలేదు. ఇక తన దృష్టంతా సినిమాల మీదే అని చెప్పినా... మళ్లీ దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమాయణం స్టార్ట్ అయింది. అతన్నైనా పెళ్లి చేసుకుంటుందేమో అనుకునే సమయంలో తాజాగా వారిద్దరూ విడిపోయినట్టు టాక్ నడుస్తోంది. ఈసారి కూడా నయన ప్రేమలో విఫలమై ఒంటరిదైపోయింది. నయన్ ప్రేమకు బై చెప్పి సంప్రదాయంగా పెద్దలు చూసిన వివాహం చేసుకోవడం మంచిదేమో అంటూ పలువురు సినీ లవర్స్ అనేస్తున్నారు. మరి ఈ అమ్మడు ఏమి చేస్తుందో చూడాలి.

English summary

Nayanthara fails again in love