మెగా ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన నయనతార!!

Nayanthara gave shock to Ram Charan Tej

05:30 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Nayanthara gave shock to Ram Charan Tej

మెగాస్టార్ 150వ చిత్రం కత్తి రీమేక్ ను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. చరణ్ నటించబోయే తరువాత సినిమా ఓకే అయినప్పటికీ, తండ్రి చిరు 150వ చిత్రం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఈ సినిమా కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా లో సమంత పాత్రని నయనతార తో చేయించేందుకు నిర్ణయించుకున్నారు. దీని కోసం రామ్ చరణ్ నయన్ ను సంప్రదించాడు. అయితే నయన్ అడిగిన పారితోషకం వినగానే చరణ్ షాక్ తిన్నాడని సమాచారం. ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రెండున్నర కోట్లు డిమ్యాండ్ చేసిందట. తమిళం లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ను సాధించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నయన్ కొనసాగుతుంది.

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లు సంఖ్య తక్కువ కాబట్టి ఈ సినమా కు ఎంతైనా ఇస్తారనే విషయం తెలిసే ఎక్కువ డిమ్యాండ్ చేస్తుందని సమాచారం. నయన్ ఎక్కువగా డిమ్యాండ్ చెయ్యడంతో చరణ్ ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తున్నాడట. అయితే చిరు పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ ను నయన్ మిస్ చేసుకుంటుందా? ఇది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగల్సిందే.

English summary

Nayanthara gave shock to Ram Charan Tej because she asked 2 and half crores remuneration for Kathi remake in telugu and to romance with Chiranjeevi.