30 ప్లస్ లో కూడా హాట్ నెస్ గుప్పిస్తున్న నయన

Nayanthara hot still from Iru Mugan movie

10:29 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Nayanthara hot still from Iru Mugan movie

అవును, శ్రీరామరాజ్యంతో సినిమాల్లో నుండి ఎగ్జిట్ అయిపోవడం.. ఆ తరువాత బ్రేకప్ చేసుకుని మళ్ళీ సినిమాల్లోకి రావడం, ఇప్పుడు ఏకంగా స్కర్ట్ వేసుకుని రెచ్చగొట్టడం అందాల నయనతారకే చెల్లింది. ఈ అమ్మడు కేవలం ఎక్సపోజింగ్ మీదనే ఆధారపడిన హీరోయిన్ గా కాకుండా.. యాక్టింగ్ వచ్చిన హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం మొదలెట్టేసింది. దానితో అమ్మడు ఇప్పుడు స్కిన్ షో అంటే నో అనేస్తోందట. కాకపోతే సినిమా అన్నాక కాస్తో కూస్తో గ్లామర్ దట్టించాలి కాబట్టి.. తనకు నచ్చిన స్టయిల్లో నయన హాట్నెస్ ను గుప్పిస్తోంది. త్వరలోనే విడుదలవ్వనున్న 'ఇరు ముగన్' - తెలుగులో 'ఇంకొక్కడు' సినిమాలో అమ్మడు దుమ్మేలేపేసే పనిలో బిజీగా ఉంది.

ముఖ్యంగా ఈ సినిమాలో ఒక రిసార్టులో తీసిన సాంగ్ ఒకటి ఉంది. దానిలో అయితే అమ్మడు పొట్టి స్కర్టుల్లో లెగ్ షో చేస్తూ.. ఓ ఊపు ఊపేస్తోందట. ఈ పాట తాలూకు స్టిల్స్ చూస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. నయన గ్లామర్ నయనానందం క్రియేట్ చేస్తూ.. కేకలు పెట్టిస్తోంది. మొత్తానికి తెలుగులో బాబూ బంగారం సినిమా కోసం మరి అమ్మడు గ్లామర్ ఆరబోత చేపట్టిందో లేదో తెలియదు కాని.. ఆ స్లిమ్ లుక్కులోనే కావల్సినంత మ్యాజిక్ మాత్రం సృష్టించింది. మొత్తానికి 30 దాటిన తరువాత నయనకు స్టార్డమ్ వచ్చినట్లు ఉందని సినీ లవర్స్ ఒకటే కామెంట్స్.

English summary

Nayanthara hot still from Iru Mugan movie