చిరంజీవి ని అవమానించిన స్టార్ హీరోయిన్

Nayanthara insults Chiranjeevi

06:40 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Nayanthara insults Chiranjeevi

ఒకప్పుడు టాలీవుడ్ ని యేలీన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం తరువాత రాజకీయాల్లోకి వెళ్ళి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చి అభిమానుల్ని కూడా పోగొట్టుకున్నాడు చిరంజీవి. అయితే మళ్లీ తిరిగి అభిమానుల్ని సంపాదించుకోవాలని తన 150వ చిత్రం ద్వారా మళ్లీ సినిమా ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళం లో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రం రీమేక్ లో నటించాలని చిరు డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలియజేశారు. చిరు తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

అయితే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి కారణంగా దాన్ని వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చెయ్యాలని భావించారు చిత్ర బృందం. అయితే ఈ చిత్రంలో నటించడానికి నయనతార భారీ పారితోషికం అడిగినా చిరు సినిమా కాబట్టి అంత పారితోషికం ఇవ్వడానికి చిత్ర టీమ్ ఒప్పుకుంది. కానీ... ఇప్పుడు ఈ చిత్రాన్ని కాదని బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమాకు నయనతార ఓకే చెప్పిందట. ఇప్పటికే లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తరువాత బాలయ్య-చిరుల మధ్య మాటల యుధ్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయనతార చిరంజీవిని కాదని బాలయ్య చిత్రానికి నయనతార ఓకే చెప్పడంతో చిరంజీవికి ఘోర అవమానమే జరిగిందని అనుకుంటున్నారు.

English summary

Nayanthara insults Chiranjeevi. Hot beauty Nayanthara insults Chiranjeevi that she was rejected his Chiranjeevi 150th film.