చిన్న పిల్లాడితో లిప్ లాక్.. నయన్ పై మహిళా సంఘాల సీరియస్

Nayanthara liplock with kid in Thirunaal movie

03:08 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Nayanthara liplock with kid in Thirunaal movie

కొన్ని వివాదాలు అనుకోకుండా వస్తాయి. కొన్ని వివాదాలను కొని తెచ్చుకుంటారు. సరిగ్గా మలయాళీ బ్యూటీ నయనతార విషయంలో అదే జరిగింది. దీంతో మహిళా సంఘాలు ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. నిజానికి సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె వివాదాలకు కేరాఫ్ ఆడ్రస్ గా నిలుస్తోంది. ఇంతకు ముందు ఓ సినిమాలో హీరో శింబుతో నయన్ చేసిన ఓ లిప్ లాక్ సంచలనం సృష్టించింది. దాన్ని సినిమా నుంచి తొలగించాలని మహిళా సంఘాలు అప్పట్లో రోడ్డెక్కాయి. ఇప్పుడు తాజాగా మరో లిప్ లాక్ వివాదంలో నయనతార చిక్కుకుంది. అయితే ఈ లిప్ లాక్ మరీ జుగుప్స కలిగించేదిగా ఉంది. ఎందుకంటే అది చిన్నపిల్లాడితో లిప్ లాక్.

ఇటీవల తను చేసిన 'తిరునాళ్' సినిమా నయన్ కు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతారకు బ్రేక్ వేసింది. అట్టర్ ఫ్లాప్ అవడమే ఆమెను బాధపెడుతుంటే.. ఆ సినిమాలోని ఓ సీన్ వివాదాల పాల్జేసింది. ఆ సినిమాలో ఓ సీన్ లో స్కూల్ పిల్లలకు గిఫ్ట్ లు ఇస్తూ తన బుగ్గ మీద వారి చేత ముద్దులు పెట్టించుకుంటుంది నయనతార. పిల్లలందరూ ఆమె చెప్పినట్టే చేస్తారు. అయితే ఓ పిల్లాడు మాత్రం ఆమె మొహాన్ని చేతుల మధ్యకు తీసుకుని పెదాల మీద ముద్దు పెట్టేస్తాడు. ఇదే నయనతారకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మహిళా సంఘాలు, బాలల హక్కు సంఘాల వారు ఆమెపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రేక్షకుల ఆదరణ నోచుకోని ఈ సినిమాకు ఈ వివాదం పుణ్యమాని పబ్లిసిటీ అమాంతం వచ్చేసింది. మరి నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary

Nayanthara liplock with kid in Thirunaal movie