చివరికి శింబుని పెళ్లి చేసుకున్న నయనతార!

Nayanthara married Simbu

12:49 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Nayanthara married Simbu

ఒకప్పుడు ప్రేమలో మునిగిపోయి ఆ తరువాత విడిపోయిన నయనతార-శింబు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్‌లో మాత్రమే! వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న కోలీవుడ్ మూవీ ఇదు నమ్మ ఆలు ఎట్టకేలకు థియేటర్స్‌కు వచ్చేందుకు రెడీ అయ్యింది. రియల్ లైఫ్‌లో డేటింగ్ తర్వాత నయనతార- శింబు విడిపోయారు. లైఫ్‌లో వీళ్లు కలవడం అసాధ్యమని భావిస్తున్న టైమ్‌లో డైరెక్టర్ పాండిరాజ్ కేర్ తీసుకుని సినిమాని తెరకెక్కించాడు. గతేడాది రావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాల మరింత ఆలస్యమైంది. ఈనెల 27న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో శింబు-నయనతారల ఫోటోలను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫిల్మ్‌లోనూ వీళ్లు లవర్స్‌గానే కనిపిస్తున్నట్లు టాక్. పెద్దలను ఎదురించి సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకుంటారని, ఈ లవర్స్‌ని విడగొట్టే రోల్లో తాప్సీ కనిపిస్తోందని కోలీవుడ్ సమాచారం. ఇప్పటివరకు వరస ఫ్లాప్‌లు, మరోవైపు వివాదాస్పద సాంగ్‌తో అనేక సమస్యలు తెచ్చుకున్న శింబు, ఈ మూవీతోనైనా గట్టెక్కుతాడేమో చూడాలి.

English summary

Nayanthara married Simbu