కుర్ర హీరోలకు నయన షరతులు పెట్టేసింది

Nayanthara putting conditions for movies

01:07 PM ON 4th July, 2016 By Mirchi Vilas

Nayanthara putting conditions for movies

అబ్బో ఇప్పటికే పలువుర్ని ప్రేమించి, ఎవరితోనూ కుదరక తన రూట్ లో తాను వెళుతున్న నయనతార వయసు మీదపడేకొద్దీ, సినిమాలో సీనియారిటీ పెరిగేకొద్ది మార్కెట్ లో రేంజ్ పెంచేసుకుంటోంది. ఇది నిజంగా మిగిలిన హీరోయిన్ల కంటే భిన్నమే మరి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ హీరోయిన్స్ కి మార్కెట్ తగ్గుతూ ఉంటుంది కదా. అందుకే నయన రూటు వేరు. 'అయ్యా'తో కెరీర్ ను ఆరంభించి 'చంద్రముఖి' సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన నయనతార తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్ అయింది. బాలకృష్ణ- జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్-రానా.. ఇలా బాబాయ్ అబ్బాయిలతో కూడా జతకట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నయన తార సొంతం చేసుకుంది.

తాను జోడీ కట్టేందుకు సీనియర్, జూనియర్ అనే బేధం లేదని అంటోంది. అసలు ఇలాంటి అడ్డంకులు తన అభినయానికి ఏమాత్రం సరిపడవని చాటిచెబుతోంది. అందుకే రజనీకాంత్ తో ఆడిపాడిన ఆమె, ప్రస్తుతం జై, ఆర్య, శివకార్తికేయన్ వంటి యువ హీరోలతో కూడా నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం విక్రమ్ తో 'ఇరుముగన్', కార్తీతో 'కాష్మోరా' లో నటిస్తున్నఈమె కొత్త హీరోలతో గానీ కుర్ర హీరోలతో గానీ జోడీకట్టాలంటే కొన్ని షరతులు తప్పవని చెబుతోంది. తన పాత్రను ఆధారంగా చేసుకునేలా కథ ఉండాలని నయన షరతు విధిస్తోందట. నానుం రౌడీదాన్ లో మాదిరిగా కథానాయిక కీలకంగా ఉండే కథకే తాను ప్రాధాన్యత ఇస్తానని కూడా తేల్చిచెప్పిందట.

దీంతో నయనతారే తమ సినిమాకు హీరోయిన్ గా ఉండాలని భావించే కుర్ర హీరోలు, దర్శకులు కథలో కాస్త మార్పులు, చేర్పులు చేసుకుంటున్నారట. అంతేకాదు నటనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే షరతు కూడా ఈ అమ్మడు పెట్టడం మరో విశేషంగా చెబుతున్నారు. టైం బాగుంటే ఎన్ని షరతులైనా పెడతారని ఫిల్మ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

English summary

Nayanthara putting conditions for movies