ఎయిర్ పోర్ట్ లో రాత్రంతా  ఎందుకు ఆగింది?     

Nayanthara Stopped At Malaysia Airport

12:40 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Nayanthara Stopped At Malaysia Airport

దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అందాల భామ నయనతార మలేషియా ఎయిర్ పోర్టులో ఓ రాత్రంతా ఆగిపోయిందట. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు తమ పాస్ పోర్టు విషయంలో వివాదాలలో చిక్కుకోవడం, పాస్ పోర్టు నిరాకరణకు గురవ్వడం వంటి ఘటనలు చూస్తూనే వున్నాం. తాజాగా ఇలాంటి చేదు అనుభవమే నయనకు ఎదురైంది. కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించి టాప్ హీరోయిన్ స్టేజీలో ఉన్న నయనతార ఈ సారి పాస్ పోర్టు వివాదంలో చిక్కుకుంది. పాస్ పోర్టులో నయనతార పేరు మిస్ మ్యాచ్ అవ్వడంతో ఈ అమ్మడు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదట.

నయనతార పేరు పాస్ పోర్టులో మిస్ మ్యాచ్ కావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమెను అక్కడే నిలిపెయడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మలేషియా ఎయిర్ పోర్టులోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది.

English summary

In recent days Soo many celebrities were stopping at international Airports. Heroine Nayanathara was stopped at Malaysia Airport due to Nayanathara name mismatched in her passport.