మరో రాములమ్మ నయన

Nayanthara will remember Vijayashanthi roles

03:17 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Nayanthara will remember Vijayashanthi roles

అవునా, రాములమ్మకు సీక్వెల్ కాదుగా... అది కాదు గానీ వివరాల్లోకి వెళదాం.. ఇంతకీ విషయం ఏమంటే, టాలీవుడ్ అందాల తార నయనతార రూటు మార్చింది. అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నయన ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై కన్నేసింది. ఇప్పటికే తమిళంలో కథానాయిక ప్రాధాన్యం ఉన్న 'మాయ', 'నానుం రౌడీదాన్' చిత్రాలు నయన్ కు మంచి గుర్తింపునివ్వడంతో ఆమె అటువంటి సినిమాలపైనే దృష్టిపెట్టారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన 'ఇరుముగన్' సినిమాలో నయన్ నటిస్తోంది. ఈ సినిమాలో నయనతార పోలీస్ పాత్రలో కనిపిస్తుందట. ఇందులో నయన్ చేసే పోరాట సన్నివేశాలు.. మన రాములమ్మ విజయశాంతి గతంలో చేసిన పోలీస్ పాత్రలను గుర్తు చేస్తాయట. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులు నయన్ నటనను చూసి విజయశాంతిని గుర్తుచేసుకుంటారని చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ పేర్కొన్నారు. అంటే మరో రాములమ్మే కదా. అదీ సంగతి.

English summary

Nayanthara will remember Vijayashanthi roles