బిగ్ బి కి జీవిత సాఫల్యం

NDTV Life Achievement Award To Amitabh Bachchan

01:07 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

NDTV Life Achievement Award To Amitabh Bachchan

బాలీవుడ్‌ దిగ్గజం, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా మరో పురస్కారం పొందారు. జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. డిల్లీలో ఎన్డీటీవీ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్స్‌ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా బిగ్‌బీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్‌ ఆయన కుటుంబ సభ్యులు జయా బచ్చన్‌, శ్వేతా పండిట్‌, అభిషేక్‌ బచ్చన్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వయసులో కూడా విభిన్న పాత్రలు చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఐదు తరాల నటీనటులతో నటించడం తన అదృష్టమన్నారు.

ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని బిగ్ బి అన్నారు. కాగా ప్రస్తుతం అమితాబ్‌ నవాజుద్దీన్‌ సిద్దిఖి, విద్యా బాలన్‌తో కలిసి తీన్‌ సినిమాలో నటిస్తున్నారు.

English summary

Bollywood Big B Amitabh Bachan was awarded by Life Achiement Award in The Event Conducted By NDTV.