ఇక పెళ్ళికి కూడా ఆధార్ తప్పనిసరి!

Need Aadhaar card for marriage

11:13 AM ON 12th October, 2016 By Mirchi Vilas

Need Aadhaar card for marriage

ఇకపై పెళ్లికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఆధార్ కార్డ్ లేని వాళ్లు కంగారుపడకండి!. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఉత్తరాఖండ్ లోని ఆల్మోరా జిల్లాలోని చితాయ్ గోలు దేవతా గుడిలో ఈ నిబంధన అమల్లో పెట్టారు. అక్కడి గుడిలో ఏడాదికి 400కి పైగా పెళ్లిళ్లు జరుగుతాయి. వివాహ ముహూర్తాలు అత్యధికంగా ఉన్న సమయంలో ఎక్కువ పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. ఆధార్ కార్డు తప్పనిసరి అని పెట్టిన నిబంధన గురించి ఆలయ కమిటీ అధికారి హరివినోద్ పంత్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వాటిలో ఇతర రాష్ట్రానికి చెందినవి ఉంటాయి.

వాళ్ల చిరునామాలు, వయసు, ప్రాంతం తెలుసుకొని పెళ్లిళ్లు చేయాలంటే ఆధార్ ఒక్కటే మార్గంగా కనిపించినట్లు చెప్పారు. కొన్నిసార్లు తక్కువ వయసున్న నేపాలీ యువతులు ఇక్కడకు వస్తున్నారని అందువల్ల ఎటువంటి చిక్కులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓటర్ గుర్తింపుకార్డు, పాన్ కార్డులు తెచ్చిన తీసుకోమని ఒక్క ఆధార్ కే ప్రాముఖ్యం ఇస్తున్నామని ఆయన చెప్పారు. అదీ సంగతి.

English summary

Need Aadhaar card for marriage