వాట్సాప్‌లో గ్రూప్ క్రియేట్ చెయ్యాలంటే లైసెన్స్ కావాలట

Need lisence to create Whatsapp group

05:11 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Need lisence to create Whatsapp group

ఇక పై వాట్సాప్‌లో ఒక గ్రూప్‌ను నడిపించాలంటే లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలత. అదేంటి వాహనం రోడ్డు పై నడపాలంటే లైసెన్స్ కావాలి, కానీ వాట్సప్‌లో గ్రూప్ పెట్టాలంటే లైసెన్స్ ఎందుకని ఆశ్చర్యపోతున్నారా! అవును నిజమే. వాట్సాప్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ యూజర్లు ఎవరికైనా ఉచితంగా గ్రూప్‌ ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఈ విష‌యంలో ఎలాంటి షరతులు ఉండ‌వు. అయితే జ‌మ్మూ క‌ాశ్మీర్ రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఈ విష‌యంలో అప్రమత్తంగా ఉంటోంది. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. వాట్సాప్‌ గ్రూపుల పై ఉక్కుపాదం మోపాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోందట.

వాట్సాప్‌లో ఒక గ్రూప్‌ను క్రియేట్ చెయ్యాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని, లైసెన్స్ లాంటి ధ్రువపత్రం సంబంధిత అధికారుల నుంచి పొందాలని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ప్ర‌స్తుతం కాశ్మీర్‌ లోయలో నెలకొన్న అలజడుల కారణంగా అల్లర్లకు ఆజ్యం పోస్తున్న సోషల్‌ మీడియా వేదికల పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం తీర్మానించుకుంది. దీంతో వాట్సాప్‌లో గ్రూప్‌ ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలన్న నిబంధన కలిగిన తొలి ప్రాంతం జమ్ముకాశ్మీరేనని తెలుస్తోంది. సోష‌ల్ మీడియా గ్రూపుల‌లో పోస్టులు చేయాలంటే అందుకు ముందుగా జిల్లా డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది.

కాశ్మీర్‌లో ఏ చిన్న అలజడి జరిగినా రాష్ట్రమంతటా ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నారు. తాజాగా అప్ఘ‌నిస్తాన్‌లోని హంద్వారాలో కాల్పుల నేపథ్యంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్‌ గ్రూపుల పై కూడా ఆంక్షలు విధించడం పై కాశ్మీర్‌ వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. సోష‌ల్‌ మీడియా పై మితిమీరిన ఆంక్ష‌లు పెడితే అది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని నెటిజ‌న్లు, కాశ్మీర్ ప్ర‌జ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Need lisence to create Whatsapp group. This law is not in our State. This law is for Jammu Kashmir people. Yes is new law for Jammu Kashmir people. If any one in Jammu Kashmir whatsapp users want to create groups, they need lisence.