వీటిని కోయకుండా తినేయొచ్చు

Need not to kill chicken and mutton but you can eat

07:08 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Need not to kill chicken and mutton but you can eat

జంతు ప్రేమికులకు శుభవార్త నాన్‌వెజ్‌ తినాలని ఉన్నా జంతువుల మీద ప్రేమతో తినడానికి ఇష్టపడని వారికి శుభవార్త ఇది. జంతువులను చంపకుండా చికెన్ తినొచ్చు. అసాద్యమనిపిస్తుంది కదా ! కాని అసాద్యమనిపించే ఈ అంశాన్ని సైంటిస్టులు సుసాధ్యం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే ఫ్యాక్టరీలలో మాంసాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియని అభివృద్ది చేస్తున్నారు. అమెరికాలో ఈ విధానాన్ని ఇండియన్‌-అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఉమ ఎన్‌ వాలేటి నేతృత్వంలోని బృందం కనుగొంది. టెక్నాలజీ అడ్వాన్స్‌ అయ్యే కొద్దీ నమ్మలేని అంశాలు కూడా నిజరూపం పొందుతున్నాయి.

వాలేటి బృందం అభివృద్ది చేస్తున్న విధానం ప్రకారం మనకు ఏ జంతువు మాంసం కావాలన్నా వాటి నుండి కణాలను తీసుకుని వాటిని తమంతట తాముగా అభివృద్ది చెందగలిగిన వాతావరణంలో ఉంచుతారు. వాటికి అవసరమైన పోషకాలను అందజేస్తారు. పోషకాల ఆదారంగా ఆ కణాలు పునరుత్పత్తి చెందుతూ వస్తాయి. జంతువులను బట్టి మాంసం 9 రోజుల నుండి 21 రోజులు ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా డెవలప్ అయిన మాంసంలో ఎటువంటి పురుగు మందుల అవశేషాలు, అనారోగ్యకరమైన పదార్ధాల లాంటివి ఉండవు. ఇది అసలైన మాంసం మాదిరిగానే ఉంటుంది అని వాలేటి బృందం తెలిపారు.

ఈ తరహాలో మాంసాన్ని మూడేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని వారు తెలిపారు. పరిశోధక బృందం అధికంగా గొడ్డు, కోడి, పంది మాంసం మీద దృష్టి పెట్టారు. వాలేటి తెలుగు జాతి వారే, జంతు ప్రేమికుడు. అతడు మిన్నె సోటా యూని వర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. జంతువుల మీద ప్రేమతో వాటిని వధించడాన్ని ఖండించాలని లక్ష్యంతో పరిశోధన సాగించి విజయం సాధించారు. వాలేటి పరిశోధన చాలా బాగుంది కాని మరి కోళ్ల పెంపకం, పందుల పెంపకం మీద ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఏమిటి.

English summary

Uma s valeti team discovers new thing that is you Need not to kill chicken, pig and goat still you can eat chicken, pig and mutton