'నీర్జా' రీలిజ్ కి రెడీ     

Neerja Movie Ready To Release

09:54 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Neerja Movie Ready To Release

గుండెల నిండా ధైర్యంతో, అద్భుతమైన వ్యూహంతో తీవ్రవాదుల నుంచి ప్రయాణీకులను రక్షించిన ఓ సాధారణ ఎయిర్‌ హోస్టెస్‌ అద్భుత గాధను ఇతివృత్తంగా ఎంచుకుని, తెరకెక్కించిన ‘నీర్జా’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఇది. సాటి మనుషులను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన నీర్జా బానోత్‌ అనే ఓ ధీరవనిత గాథ. నీర్జా పాత్రలో సోనమ్‌ కపూర్‌ నటించిగా రామ్‌ మధ్వానీ తెరకెక్కించాడు.

ఇంతకీ నీర్జా గురించి ఇప్పుడు సినిమా విపత్కర పరిస్థితుల్లో అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించినవారికిచ్చే అశోక చక్ర పురస్కారంతో భారత ప్రభుత్వం నీర్జాను సత్కరించింది. ఈ గౌరవాన్ని పొందిన అతి పిన్న వయస్కురాలు నీర్జానే. ఇక అమెరికా, పాకిస్తాన్‌ల నుంచీ నీర్జాకు పురస్కారాలు వచ్చాయి. నీర్జా స్మారకంగా భారత తపాలా శాఖ స్టాంపును విడుదల చేసింది. ఇంకా చెప్పాలంటే, ముంబయిలోని ఓ సెంటర్ కి నీర్జా బానోత్‌ పేరు పెట్టారు.

నీర్జా పాత్ర కోసం ఎయిర్‌ హోస్టెస్‌ల జీవితాలను పరిశీలించినట్లు హీరోయిన్ సోనమ్‌ వివరించింది. నీర్జాగా తన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చి నందుకు సంబరపడిన సోనమ్‌ ఇక ఈ చిత్రం తప్పకుండా ఆదరణకు నోచుకుంటుందని ధీమాగా చెబుతోంది. నీర్జా తల్లి పాత్రలో షబానా ఆజ్మీ నటించింది.

ప్రయాణీకులను సురక్షితంగా బయటపడేయడమే తన కర్తవ్యంగా భావించి, ముఖ్యంగా ముగ్గురు చిన్నారులను తుపాకీ గుళ్ల నుంచి కాపాడేందుకు నీర్జా ఎదురొడ్డి నిల్చుంది. చివరకు తీవ్రావాదుల తూటాలకు తాను బలైనా వారికి ప్రాణం పోసింది. విచిత్రమేమంటే, 1986 సెప్టెంబరు 5న జరిగిన ఈ ఘటనలో ఆ విధంగా కాపాడబడ్డ ఆ ముగ్గురు పిల్లల్లో అప్పుడు ఏడేళ్లున్న ఓ అబ్బాయి నేడు ఎయిర్‌లైన్స్‌ కెప్టెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక 22 ఏళ్లకే అసువులు బాసిన నీర్జా బానోత్‌ జీవితం ఇచ్చే స్ఫూర్తి ని ఇప్పుడు తెరమీద ఆవిష్ర్కుతమవుతోంది.

English summary

Bollywood Glamours heroine Sonam Kapoor's New upcoming Lady Oriented film Neerja Movie was ready for the release.This movie was made by based on true story.