‘నీర్జా’ పోస్టర్‌ రిలీజ్ 

Neerja poster released

05:11 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Neerja poster released

బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘నీర్జా’ చిత్రం పోస్టర్‌ విడుదలైంది. ట్విట్టర్‌ ఖాతా ద్వారా సోనమ్‌ ఈ విషయాన్ని తెలుపుతూ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. 1986లో జరిగిన ఓ ఎయిర్‌హోస్టెస్‌ నిజ జీవితకథ ఆధారంగా దర్శకుడు రామ్‌ మధ్వానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సోనమ్‌ తండ్రి, నటుడు అనిల్‌ కపూర్‌ ట్వీట్‌ చేస్తూ, నీర్జా(సోనమ్‌ కపూర్‌) ధైర్యం, బలం ఈ పోస్టర్లో కనబడుతోందని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 19న ‘నీరజ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభించిన సంగతి విదితమే.

English summary

Neerja poster released, sonam kapoor announced on twitter account. In this film Sonam kapoor acted as main role.