ఫస్ట్‌లుక్‌తో జనాలను భయపెడుతున్న హీరో

Nenjam Marappathillai movie first look

11:50 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Nenjam Marappathillai movie first look

మనం చూస్తున్నది త్వరలో విడుదల కాబోయే ఓ తమిళ సినిమా పోస్టర్. సెల్వ రాఘవన్ దర్శకుడు. మరి పోస్టర్ లో వైవిధ్యమైన అవతారంలో కనిపిస్తున్న నటుడెవరో గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది కదూ. ఇంతకీ ఎవరంటే, అతను స్వతహాగా ఓ డైరెక్టర్. తమిళంలో సెన్సేషనల్ హిట్లిచ్చాడు. తెలుగులోనూ ఓ సూపర్ స్టార్ తో బ్లాక్ బస్టర్ తీశాడు. మళ్లీ అదే హీరోతో ఓ డిజాస్టర్ చేశాడు. ఇంకో తెలుగు సూపర్ స్టార్ తో చేసిన సినిమా కూడా డిజాస్టరే. అయితే ఈ మధ్య దర్శకత్వం మానేసి నటుడిగా బిజీ అయిపోయాడు. అతడే ఎస్.జె సూర్య.
మరి ఈ పోస్టర్లో కనిపిస్తున్న నటుడు మరెవరో కాదు.. రెండు రోజులుగా టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతున్న ఎస్.జె.సూర్యయే.

ఆశ్చర్యంగా అనిపించేలా అతణ్ని సెల్వరాఘవన్ అలా తయారు చేశాడు. వర్ణ సినిమా తర్వాత బాగా వెనుకబడిపోయిన సెల్వరాఘవన్ సుదీర్ఘ విరామం తర్వాత నెంజం మరప్పదిల్లై పేరుతో ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేశాడు. ఇదో హార్రర్ థ్రిల్లర్ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే.. దీన్ని మరో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నిర్మించాడు. ఇప్పటిదాకా వేరే దర్శకుల సినిమాల్లో ఎస్.జె. సూర్య సోలో హీరోగా నటించింది లేదు. తొలిసారి చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో బిజీగా ఉండడం వల్లే పవర్ స్టార్ సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ పోగుట్టుకున్నాడు ఎస్.జె సూర్య.

English summary

Nenjam Marappathillai movie first look