డిసెంబర్‌ 21న 'నేను - శైలజ' ఆడియో !

Nenu-Sailaja audio on December 21st

12:12 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Nenu-Sailaja audio on December 21st

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'నేను - శైలజ'. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ డీజే (డిస్కో జాకీ) గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రామ్‌ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా పరిచయమవుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకం పై స్రవంతి రవి కిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణచైతన్య సమర్పిస్తున్నారు. 55 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం పాటలను డిసెంబర్‌ 21 న విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న విడుదల చేయబోతున్నారు.


English summary

Nenu-Sailaja audio on December 21st. Ram and Keerthi Suresh is acting in lead roles in this film.