కొత్త మలుపు తీసుకున్న రామ్‌ వివాదం

Nenu-Sailaja Movie Contreversy

12:05 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Nenu-Sailaja Movie Contreversy

టాలీవుడ్ ఎనర్జీటిక్ హీరో రామ్‌ నటించిన 'నేను-శైలజ' పై ఒక చానల్‌ చేసిన రివ్యూ గొడవకు దారి తీసింది. అయితే ఈ గొడవ నిన్న రాత్రి ఒక విచిత్రమైన మలుపుతీసుకుంది. అదే చానల్‌లో పనిచేస్తున్న ఉద్యోగి నవీన్‌ 'నేను-శైలజ' రివ్యూని వ్యతిరేకించి సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడినందుకు చానల్‌ యాజయాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

ఈ విషయం తెలిసిన రామ్‌ ట్విట్టర్‌లో ఆవేశంగా స్పందించాడు. నవీన్‌ తన అభిమాని అని తెలుసుకుని నవీన్‌కు క్షమాపణలు చెప్పాడు. అతనికి మరో జాబ్‌ వచ్చేవరకు తన ఆఫీస్‌కు వచ్చి ప్రతినెలా జీతం తీసుకోవచ్చని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ విషయం పై రామ్ మాట్లాడుతూ 'నేను-శైలజ' రివ్యూ పై వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ చానల్‌ ఉద్యోగిని తొలగించారు. అతను నా అభిమాని అని కూడా తెలిసింది. ఈ సమాజం ఎటు పోతుందో అర్ధం కావట్లేదు అని రామ్‌ అన్నారు.

English summary

One television channel gave negative review on ram's new movie nenu-sailaja.Ram also responded against that tv channel previously .Now an employee was suspended by that channel for opposing that channel news