ఇండియాలో అడుగుపెట్టిన నెట్‌ఫ్లిక్స్‌

Netflix Now Available in India

05:15 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Netflix Now Available  in India

అమెరికాకు చెందిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో తన సర్వీసులను ప్రారంభించింది. భారత్‌తో పాటు మరో 130 దేశాల్లో తన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2016 చివరి నాటికి 200 దేశాల్లో సర్వీసులను ప్రారంభించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు, ప్రత్యేక ప్రదర్శనల వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించిన కాపీరైటు హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కలిగి ఉంటుంది. భారత్ లో సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా ఓ స్పెషల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మూడు రకాల ప్లాన్‌లను 30 రోజుల కాలపరిమితితో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వీటిని కొనుగోలు చేస్తే మొదటి నెల ఉచితంగా వీడియోలను చూడవచ్చు. రూ. 500 కే బేసిక్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దీనిలో స్టాండర్డ్‌ క్వాలిటీతో వీడియోలను చూడవచ్చు. ఇక రెండో ప్లాన్ ధర రూ.650. ఇందులో హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను చూసే అవకాశం ఈ ప్లాన్‌లో లభిస్తుంది. ఇక మూడోదైన ప్రీమియం ప్లాన్‌లో 4కే రిజిల్యూషన్‌ కలిగిన వీడియోలను చూడవచ్చు. దీని కోసం రూ.850 చెల్లించాల్సి ఉంటుంది.

English summary

Netflix has officially announced its entry into India and 129 other markets in Asia, the Middle East, and Europe.