నెట్‌గేర్ నుంచి కొత్త రూటర్..

Netgear Nighthawk X8 Wi-Fi Router Launched

04:11 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Netgear Nighthawk X8 Wi-Fi Router Launched

నెట్‌గేర్ సంస్థ కొత్త వైఫై రూటర్ ను విడుదల చేసింది. 'నైట్‌హాక్ ఎక్స్8' పేరిట రూపొందించిన ఈ సరికొత్త వైఫై రూటర్‌ ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి చ్చింది. 4 యాంటెన్నాలున్న ఈ రూటర్ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించగలుగుతుందని కంపెనీ చెపుతోంది. దాదాపు 5.3 జీబీపీఎస్ గరిష్ట స్పీడ్‌ను దీని ద్వారా పొందవచ్చంటోంది. ఇందులో 1.4 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తోపాటు 6 ఈథర్‌నెట్ పోర్ట్స్ ఉన్నాయి. వినియోగదారుల ఇంటర్నెట్ స్పీడ్‌లకు అనుగుణంగా వివిధ రకాల వైఫై బ్యాండ్‌లలో ఇది సిగ్నల్స్‌ను అందిస్తుంది. అంతేకాదు ఈ రూటర్ దానికి కనెక్ట్ అయి ఉన్న డివైస్‌ల గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. యూజర్లు ఏయే డివైస్‌లు వాడుతున్నారు, ఏ అప్లికేషన్లు ఓపెన్ చేస్తున్నారు తదితర విషయాలన్నీ దీంతో తెలుస్తాయి. ఎక్కువ దూరం సిగ్నల్స్‌ను అందించడం నైట్ హాక్ ఎక్స్ 8 ప్రత్యేకత. దీని ధర రూ.27వేలు.

English summary

US based networking company netgear launched the Nighthawk X8 Wi-Fi router in India. These routers price are starting at Rs. 27,000