ప్రియాంకను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

Netizens controversy comments on Priyanka Chopra

11:21 AM ON 12th October, 2016 By Mirchi Vilas

Netizens controversy comments on Priyanka Chopra

బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకున్న నటి ప్రియాంకా చోప్రాని నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. కారణం ఏమంటే, ఇప్పుడు క్వాంటికో సిరీస్ లో నటిస్తున్న ప్రియాంక అక్కడి మ్యాగజైన్ కవర్లకు హాట్ హాట్ ఫోజులిస్తూ మత్తెక్కిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ట్రావెలర్ మ్యాగజైన్ కోసం ఆమె ఓ లో-నెక్ వైట్ టీ-షర్ట్ ధరించి ఫోజిచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఆమె ధరించిన టీ-షర్టు గురించి కాదు. ఆ టీ-షర్టు మీద రాతల గురించి. ఆ టీ-షర్టు మీద రెఫ్యూజీ(శరణార్థి), ఇమిగ్రెంట్(వలసవాది), ఔట్ సైడర్(బయటి వ్యక్తి), ట్రావెలర్(ప్రయాణికుడు) అనే పదాలు రాసి ఉన్నాయి.

అయితే అందులో మొదటి మూడు పదాలు కొట్టేసి ఉన్నాయి. అంటే మొదటి ముగ్గురిగా ఉండడం కంటే ట్రావెలర్ గా ఉండడం ఇష్టమని అర్థం. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతకడం కష్టమై.. పొట్టకూటి కోసం శరణార్థులుగా, వలసవాదలుగా ఇతర దేశాలను ఆశ్రయిస్తున్న వారిని తీవ్రంగా కించపరిచేలా ప్రియాంక ఆ ఫోజిచ్చిందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటీమణి అయిన ప్రియాంకకు ఓ శరణార్థి బాధ ఎలా తెలుస్తుందని నెటిజన్లు నిలదీస్తున్నారు.

English summary

Netizens controversy comments on Priyanka Chopra