ఫైర్ బ్రాండ్ తీరుపై నెటిజన్ల మండిపాటు

Netizens Fires On Ex Minister Renuka Chowdary

01:29 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Netizens Fires On Ex Minister Renuka Chowdary

ఒకప్పుడు టిడిపిలో వున్నా, ఇప్పుడు కాంగ్రెస్ లో వున్నా సరే, మాజీ మంత్రి రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్. ఎదుటి వారిపై విరుచుకు పడడంలో ఈమె తీరే వేరు. అయితే ఇప్పుడు ఈమె తీరు వివాదాస్పదమైంది. ఈమె పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. నెటిజన్లు ఆమె తీరుపై హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, రేణుక తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లారు. ఫ్యామిలీ తింటున్నంతసేపు ఓ అమ్మాయి వాళ్ల టేబుల్ దగ్గరే చేతులుకట్టుకుని నిలబడి ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి రేణుకచౌదరి వాళ్లింట్లో పనిచేసే అమ్మాయి. ఇంట్లోని చిన్న పాప బాబోగులు ఆ అమ్మాయి చూసుకుంటుందట. తమతో పాటు భోజనం పెట్టించలేనప్పుడు అసలు ఆ అమ్మాయిని రెస్టారెంట్ కు తీసుకురావడమెందుకని రిషి బగ్రీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఫొటో పెట్టి కామెంట్ చేశాడు.

దీనిపై నెటిజన్లు భారీగానే స్పందిస్తున్నారు. ట్విట్టర్లో పెట్టిన ఈ పోస్టింగ్ ను ఒకే రోజు దాదాపు రెండువేల మంది రీట్వీట్ చేశారు. పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి కొనసాగుతుందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక సాక్ష్యం అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన రేణుక ఇలా చేస్తారా అని మరికొందరు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షపార్టీలపై చీటికీమాటికీ ఒంటికాలిపై లేచి ఉపన్యాసాలు దంచే పొలిటికల్ ఫైర్ బ్రాండ్, ఇంటి దగ్గరకొచ్చేసరికి ఇలా చేయటమేమిటని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్ అయిన రేణుకకు సోషల్ రెస్పాన్సిబులిటీ ఉండాలని అంటున్నారు. అయితే, అసలు దీనిలో నిజమెంతో అని మరికొందరు అంటున్నారు. ..దీనిపై రేణుకా ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary

Ex-Union Minister Renuka Chowdary was slammed on twitter for making a girl child standing behind her while they were in restaurant. Now this photo was going viral over the internet.