నోట్ల రద్దుపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు!

Netizens shocking comments on banning of 500 and 1000 notes issue

01:09 PM ON 16th November, 2016 By Mirchi Vilas

Netizens shocking comments on banning of 500 and 1000 notes issue

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసి వారం రోజులు దాటినా సామాన్యుల కష్టాలు తొలగిపోలేదు. తొలిరోజుతో పోలిస్తే ఇబ్బందులు కొంత తగ్గినప్పటికీ కష్టాలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. బ్యాంకుల ముందు క్యూలైన్లూ తగ్గలేదు. డబ్బుల డిపాజిట్ కోసం, డ్రా చేసుకునేందుకు ప్రజలు ఓపికగా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఎవరూ వ్యతిరేకించకపోయినప్పటికీ అమలులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం లేకపోగా కొత్త రూ.2వేల నోట్ల వల్ల నల్లధనం మరింత పోగుపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.

మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకడుగు ముందుకు వేసి నల్లధనం వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని సెలవిచ్చారు. ఆర్థిక మాంద్యాన్ని నల్లధనంతో బహుబాగా ఎదుర్కోవచ్చంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ప్రజలు ఎండనక, చలి అనక గంటల తరబడి నిల్చుంటున్నారని, తమ గుండెలు తరుక్కుపోతున్నాయని పేదల కష్టాలను ఎత్తిచూపుతున్నాయి.

1/4 Pages

ఇక సోషల్ మీడియాలో నోట్ల రద్దు వ్యవహారంపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. జియో సిమ్ ల కోసం, సినిమా టికెట్ల కోసం, క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం గంటల తరబడి నిల్చుంటారు కానీ దేశానికి మేలు చేసే ఒక మంచి పనికి మద్దతు తెలుపక పోగా విమర్శలు గుప్పిస్తారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

English summary

Netizens shocking comments on banning of 500 and 1000 notes issue