అబ్బచ..ప్రధాని అవ్వాలన్న కోరికే లేదట...

Never desired to become Prime Minister Says Nitish Kumar

12:58 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Never desired to become Prime Minister Says Nitish Kumar

గడిచిన ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, మూడో కూటమి నుంచి ప్రధాని అభ్యర్ధిగా వార్తల్లోకి ఎక్కిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కి అసలు ప్రధాని అవ్వాలనే కోరిక లేదట. సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవితచరిత్ర పుస్తకం విడుదల కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 సాధారణ ఎన్నికల్లో ప్రధానమంత్రిగా పోటీచేస్తారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రధాని అవ్వాలన్న కోరిక తనకెప్పుడూ లేదని స్పష్టం చేసేసారు. కావాలని కొందరు ఇలాంటి పుకార్లు చేస్తున్నారని.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రధాని అవ్వాలని మాత్రం తాను ఏనాడు అనుకోలేదని వివరించారు. కానీ.. జీవిత కాలంలో ఒక్కసారైనా పార్లమెంటు సభ్యుడినైతే చాలనుకున్నానని మాత్రం ఆయన మనసులో మాట చెప్పారు.

రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో వరుసగా రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయానని నితీశ్ గుర్తుచేస్తూ, అయినా తాను ఏ మాత్రం నమ్మకం పోగొట్టుకోకుండా కష్టపడి పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. కాగా ‘సూపర్ 30’ ఆనంద్ కుమార్ సేవలను నితీశ్ మెచ్చుకున్నారు.

ఇవి కూడా చూడండి:అమలాపురంలో ఉద్రిక్తత - స్టేషన్ ఎదుట ముద్రగడ భైఠాయింపు

ఇవి కూడా చూడండి:అమెరికాలో బాలయ్య రేంజ్ చూస్తే, షాక్ ..

English summary

Bihar State Chief Minister Nitish Kumar said that he never dreamed to become Prime Minister Of India. He said that but he desired to become a parliament member.