వావ్... కొత్త వెయ్యినోటు ఇదేనట!

New 1000 rupees is going viral

10:54 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

New 1000 rupees is going viral

పెద్ద నోట్లు రద్దు చేసి కేంద్రం ఇప్పటికే 500 కొత్త నోట్లు కొన్ని చోట్ల చెలామణిలో తెచ్చింది. ఇప్పుడు వెయ్యి నోటు కూడా తేవాలని సర్కార్ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర ఆర్ధిక శాఖ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇదే కొత్త వెయ్యినోటు అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది అవునో కాదో కానీ, దేని ఫీచర్స్ చూస్తే, లేత నీలం రంగులో ఉన్న ఈ నోటుపై గాంధీ ఫోటో ఉంది. రద్దైన తర్వాత వచ్చిన రెండు వేల రూపాయలు, ఐదొందల రూపాయల నోట్లను పోలి ఉండటంతో అంతా నిజమైనదేనని అనుకుంటున్నారు.

ఎందుకంటే, గతంలో పెద్ద నోట్ల రద్దుకు ముందే రెండు వేల రూపాయల నోటు సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తొలుత దాన్నెవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఆ తర్వాత అదే నిజమైంది. కొత్త రెండు వేల రూపాయల నోటు విషయంలో ఎలా జరిగిందో ప్రస్తుతం కొత్త వెయ్యి రూపాయల నోటు విషయంలో కూడా జరగవచ్చని నెటిజన్లు ఊహిస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ అధికారికంగా చెప్పేదాకా కొత్త వెయ్యి నోటుపై పుకార్లను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

English summary

New 1000 rupees is going viral