కొత్తగా రూ. 20, 50 నోట్లు.. మరి పాతనోట్లు సంగతేంటి?

New 20 and 50 rupees notes is coming

12:13 PM ON 5th December, 2016 By Mirchi Vilas

New 20 and 50 rupees notes is coming

నల్లధనంపై పోరాటంలో భాగంగా పెద్దనోట్ల రద్దుతో నెలకొన్న ఇబ్బందులను అధిగమించే చర్యల్లో భాగంగా కొత్తగా రూ. 20, రూ. 50 నోట్లను ఆర్బిఐ ప్రెవేశపెడుతోంది. ఈ నోట్లపై ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. చిల్లర కొరత నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా ప్రకటనతో ప్రజలకు ఊరట లభించినట్టే చెప్పవచ్చు. ఆర్బీఐ కొత్త 20 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మహాత్మా గాంధీ సిరీస్-2005లో భాగంగా ఎల్ సిరీస్ ఫార్మాట్ లో కొత్త నోట్లు ఉంటాయి.

వీటిపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు 2016 సంవత్సరం ముద్రించి ఉంటుంది కాగా, పాత రూ.20 నోట్లు యథాతథంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.

ఇక ఆర్బీఐ కొత్త 50 రూపాయల నోట్లను విడుదల చేయనున్న నేపధ్యంలోకి వెళ్తే, కొత్త నోట్లలో రెండు వైపులా నెంబర్ పానెల్స్ లో ఇన్ సెట్ లెటర్ ఉండదని పేర్కొంది. పాత రూ.50 నోట్లు యథాతథంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.

English summary

New 20 and 50 rupees notes is coming