మైక్రోమ్యాక్స్ నుంచి మరో 4జి ఫోన్

new 4g phone releases from micromax

05:32 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

new 4g phone releases from micromax

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ పేస్ 4జి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం సిద్ధంగా మార్కెట్‌లో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఐదు ఇంచుల డిస్‌ప్లే (రిజల్యూషన్ 854పిక్సెల్-480పిక్సెల్స్)గా ఉంది. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ పేస్ 4జి ఫోన్ 1.1గిగాహెర్ట్ క్వాడ్-కోర్ ప్రాసెస్ కలిగి ఉంది. ఇందులో 1జిబి ర్యామ్ ఉంది. 8జి అంతర్గత నిల్వ సామర్థాన్ని మైక్రోఎస్‌డి కార్డు ద్వారా 32జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. దీనికి 2500 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్‌లను అంగీకరిస్తుంది. అదేవిధంగా, ఈ ఫోన్‌కు వై-ఫై, జిపిఎస్, బ్లూటూత్, ఎఫ్‌ఎమ్, 3జి, 4జిల అనుసంధాన సాంకేతిక కలిగి ఉంది. దీని ధర రూ.7,999గా ఉంది.

English summary

Famous mobile phone Company micromax releases its canvas pace 4g smart phone. Its comes with features like android 5.1 lolipop operating system,5 inches screen,13 mega pixel camera ,4g,dual sim ,gps,etc