బాలీవుడ్‌ వీరికి పూలపాన్పు కానుందా...

New Actors That Going To Test Their Luck In Bollywood

10:50 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

New Actors That Going To Test Their Luck In Bollywood

కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు విభిన్న అంశాలతో చిత్రాలను అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త నటీనటుల్ని అందించే సినిమా పరిశ్రమలో ఈ ఏడాది కొంతమంది యువ నటీ నటులు బాలీవుడ్‌ తెర పై సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ‘సనమ్‌తేరీ కసమ్‌’తో హర్షవర్ధన్‌ రాణె, మవ్రా హొకేన్‌ లాంటి వాళ్ళు తమ సత్తా చాటుకున్నారు. ఇప్పుడు మరికొంతమంది అదే పనిలో ఉన్నారు. ఇందులో కొందరు వారసత్వంగా నటనలోకి వస్తే , ఇంకొందరు ఇతర పరిశ్రమలు, టీవీ రంగం నుంచి అగుగు పెట్టారు. ఇక మరికొందరు , బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవడానికి కొత్తగా వచ్చినవాళ్ళు ... ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందామా ....

1/6 Pages

మహీరా ఖాన్‌ .....

   రాయీస్‌ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న మహీరా ఖాన్‌ టీవీ ధారావాహిక ‘హమ్‌సఫర్‌’తో బుల్లితెర నటిగా అరంగేట్రం చేసి, ఇప్పుడు చిత్ర రంగంలోకి వచ్చింది. తొలి అవకాశంగా షారుఖ్‌ ఖాన్‌ సరసన చోటు దక్కించుకున్న ఈ పాకిస్థానీ భామను ఆ దేశ మీడియా ఆకాశానికెత్తేస్తోంది. ఇక షారుఖ్‌ ఖాన్‌ కూడా మా ఇద్దరి మధ్య రొమాన్స్‌ అదిరిపోతుందని ఆ అంచనాలను పెంచేశాడు. జులై 3న ఈ సినిమా విడుదలవుతోంది. మరి ఈ అమ్మడు అదృష్టం ఎలా వుందో ... 

English summary