అపరిచితులతో డేటింగ్ చేసేసారు...(వీడియో)

New American Tv Show TLC Undress

11:06 AM ON 13th July, 2016 By Mirchi Vilas

New American Tv Show TLC Undress

వింత లోకం వింత పోకడలు... లేకపోతే ఎవరో తెలీకుండా వాళ్ళతో గడిపేస్తే ఎలా... ప్రేమ గుడ్డిది అన్నారు సరే, డేటింగ్ కూడా పచ్చి గుడ్డిదా? అలానే ఉంది ఈ యవ్వారం.... వాళ్ళిద్దరూ అపరిచితులు.. ఆమె ఎవరో అతనికి తెలియదు.. అలాగే ఆయన ఎవరో ఆమెకు తెలియదు. కానీ ఇద్దరూ ఫ్రెండ్స్ లా డేటింగ్ చేసిశారు. అంతటితో ఆగిపోతే పర్వాలేదు, ఏకంగా బెడ్ మీద న్యూడ్ గా వాలిపోయి కబుర్లు ఆదుకున్నారు. బ్రిటన్ లో ఇలాంటి కొత్త టీవీ షో వయసు మళ్ళిన వాళ్ళను కూడా ఆకర్షిస్తోంది. టీ.ఎల్.సి అన్ డ్రెస్ అని వ్యవహరించే ఈ షో లో స్ట్రేంజర్స్ పాల్గొని హలో అని చెప్పుకుంటూనే వస్త్ర విసర్జన చేస్తారట. ఆ తర్వాత అలాగే బెడ్ మీద ఊసులాడుకుంటారు.

ఈ మధ్య రిటైర్డ్ పొలీసు అయిన 62 ఏళ్ళ జాకీ ముర్రే అనే ముదురు భామ ఈ షో లో పార్టిసిపేట్ చేసింది. ఈమె పార్ట్ నర్ 52 ఏళ్ళ ఫ్రెడ్.. మరి ఆయన ఏం చేస్తాడో తెలియదు గానీ ఈ కొత్త జంట కాసేపట్లోనే ఫ్రెండ్స్ గా మారిపోయి ఇంటిమేట్ కబుర్లు చెప్పుకుని సేద దీరారుట. అంతే ఇద్దరూ సన్నిహితులయ్యారు.

22 సంవత్సరాల క్రితం తాను డేటింగ్ చేశానని, ఇప్పుడు ఓ అపరిచిత వ్యక్తితో మళ్ళీ ఇలా వ్యవహరించడం నాటి తన అనుభవాలను గుర్తుకు తెచ్చాయని ముర్రే అంటోంది. పైగా ఈ షో భలే బాగుందని కితాబిచ్చింది. ఈమె..ఫ్రెడ్ ఇద్దరూ ఈ షో తర్వాత మళ్ళీ కలుసుకుందామని డిసైడ్ అయ్యారు. వచ్చే శుక్రవారం వీరి షో ప్రసారం కానుందట.

ఇక లారెన్, శామ్ అనే యువజంట కూడా ఈ సరికొత్త షో లో పాల్గొంటున్నారు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఒకరికొకరు తారస పడి డేటింగ్ చేయాలను కుంటే వాళ్ళ మధ్య ఎంతో బిడియం, మొహమాటం ఉంటాయని, అలాంటివి పోగొట్టి వాళ్ళు సన్నిహితులయ్యేలా చూడాలన్నదే ఈ షో ఉద్దేశమని నిర్వాహకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ పూల్ లో స్నానానికి దిగితే ఇక మరణమే(వీడియో)

ఇవి కూడా చదవండి:11 ఏళ్లుగా భార్య శవంతో కాపురం

English summary

A TV Show Named "TLC Undress" in America was going with good response and recently two old people with 62 and 52 age were met together in this TV show and they two were undressed and participated in this show.