షుగర్ వ్యాధిగ్రస్తులకు 'ఆయుర్వేదం'

New Ayurveda Medicine For Diabetes

10:39 AM ON 9th January, 2016 By Mirchi Vilas

New Ayurveda Medicine For Diabetes

షుగర్ వ్యాధి విస్తృతంగా ఉండడంతో ఉపశమనానికి రకరకాల మందులు వస్తున్నాయి. ఇంకా కొత్తవాటిని కనుగొంటూనే వున్నారు. ఇందులో భాగంగా శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) చవకైన ఆయుర్వేద మందును రోపొందించింది. దీని పేరు ‘బీజీఆర్‌-34’. సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ ముఖ్య సీనియర్‌ శాస్త్రవేత్త ఎ.కె.ఎస్‌.రావత్‌, సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ సీనియర్‌ శాస్త్రవేత్త డి.ఎన్‌.మణి సమక్షంలో ఈ కొత్త మందును విడుదల చేశారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న నాలుగు మొక్కల సారంతో ఈ కొత్త మందును సీఎస్‌ఐఆర్‌ అభివృద్ధి చేసింది. లఖ్‌నవూలోని సీఎస్‌ఐఆర్‌కి చెందిన రెండు అనుబంధ సంస్థలు ఈ మందు తయారీలో భాగం పంచుకున్నాయి. రక్తంలో గ్లూకోజు జీవక్రియలు మామూలుగా జరగటానికి, దీర్ఘకాలిక సమస్యల ముప్పును తగ్గించటానికి ‘బీజీఆర్‌-34’ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు

English summary

A.k.s.Rawath invents a news Ayurveda medicine for Diabetes disease.