వెయ్యి అడుగుల దూరంలో ఉన్నా బ్లూటూత్ సిగ్నల్

New Bluetooth Hub Which Covers 1000 feet distance

05:46 PM ON 8th January, 2016 By Mirchi Vilas

New Bluetooth Hub Which Covers 1000 feet distance

వైఫై కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ మనదేశంలో అనేక మందికి ఫైల్ ట్రాన్స్ ఫర్ కు బ్లూటూతే ఆధారం. సాధారంగా బ్లూటూత్ ఐదు నుంచి పది అడుగుల దూరం మాత్రమే పని చేస్తుంది. ఏమాత్రం తేడా వచ్చిందా.. మొత్తం మళ్లీ చేయాలి. దీని వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుటారు. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు పడనక్కర్లేదు. ఎందుకంటే కాసియా అనే కంపెనీ కొత్తగా విడుదల చేసిన బ్లూటూత్ హబ్ ఏకంగా వెయ్యి అడుగుల దూరం వరకు పనిచేస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2016లో ఆ సంస్థ దీనిని ప్రదర్శించింది. యూజర్లు వెయ్యి అడుగుల దూరంలో ఉన్నప్పటికీ కాసియా బ్లూటూత్ హబ్‌కు కనెక్ట్ కావచ్చు. గరిష్టంగా దీనికి 22 రకాల బ్లూటూత్ డివైస్‌లను కనెక్ట్ చేసుకునే వీలు కల్పించారు. బ్లూటూత్ 4.0 వెర్షన్ ఆధారంగా ఈ హబ్ పనిచేస్తుంది. దీనికి కనెక్ట్ అయ్యే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఆయా యాప్ స్టోర్‌లలో ప్రత్యేకంగా ఓ యాప్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్ మాత్రమే కాకుండా వైఫై, ఈథర్‌నెట్ కనెక్టివిటీని కూడా ఈ హబ్ సపోర్ట్ చేస్తుంది.

English summary

Cassia is trying to make Cassia Hub, and it's supposed to give you control over an entire home's worth of Bluetooth products no matter where you are, all without making changes to your existing devices.