ఐదో అంతస్తు నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య

New bride committed suicide

11:17 AM ON 8th June, 2016 By Mirchi Vilas

New bride committed suicide

ఇదో విషాద ఘటన... పెళ్ళైన దగ్గర నుంచీ పరిస్థితులు బాగోలేవని ఓ ఇంకా కాళ్ళ పారాణి ఆరలేదు.. వైవాహిక ఆనందం ఇంకా చవిచూడలేదు.. ఇంతలోనే వచ్చిన ఇబ్బందులు ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలోని విఠంరాజుపల్లి సమీపంలో గల బాలాజీ ఎస్టేట్స్లో మంగళవారం జరిగింది. బాలాజీ ఎస్టేట్స్ లోని ఒక ఫ్లాట్లో నివాసముంటున్న గుగ్గిలం అలేఖ్య(24)కు, చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన ఉప్పు సతీష్తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి మంచి రోజులు లేకపోవడంతో అలేఖ్య పుట్టింట్లోనే ఉంటోంది. చెన్నైలోని భర్త వద్దకు వెళ్లేందుకు ఇటీవల ఏర్పాట్లు చేసు కుంది. అంతలోనే చెన్నైలో ఉంటున్న భర్త సతీష్ బాత్రూమ్లో జారడంతో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న అలేఖ్య రెండు రోజుల నుంచి బాధపడుతూ మానసికంగా కుంగిపోయింది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక మంగళవారం అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు అందలేదట.

ఇది కూడా చూడండి: బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

ఇది కూడా చూడండి: ఒక్కడినే ప్రేమించిన తల్లీకూతుళ్ళు! ఆ తరువాత ఏమైందో తెలుసా?

ఇది కూడా చూడండి: దిష్టి మంత్రం గురించి తెలిస్తే షాకవుతారు!

English summary

New bride committed suicide by jumping from the top of apartment.