ఇంతకీ స్వాతి హంతకులు ఎందరు?

New CCTV footage of Swathi murderer suspect

12:00 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

New CCTV footage of Swathi murderer suspect

తమిళనాడులోని నుంగబక్కం రైల్వే స్టేష్టన్ లో గత శుక్రవారం ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన యువకుడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండగా, తాజాగా మరో సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. జూన్ 24 ఉదయం స్వాతి హత్య జరిగిన తర్వాత 6.51 నిమిషాలకు ఓ యువకుడు స్టేషన్ నుంచి బైక్ పై వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి స్టేషన్ బయట నడుచుకుంటూ వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు రెండు రోజుల కిందట విడుదల చేశారు. స్వాతి హత్యను చూసిన కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆధారాలు వీరిద్దరితో పోలి ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు స్వాతిని హత్య చేశారు అన్నది మిస్టరీగా మారింది. హత్యలో ఇద్దరికీ ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా స్వాతిని హత్య చేసిన తర్వాత తొలిసారిగా డి.తమిళరసన్ అనే ఉపాధ్యాయుడు ముందుకొచ్చి ఆనాటి ఘటనపై స్పందించారు. ఆయన స్వాతి ఉండే ప్రాంతంలోనే ఉంటున్నారు. స్వాతి హత్యకు కొద్దిరోజుల ముందే స్వాతిని ఓ వ్యక్తి కొట్టడం చూశానని ఆయన తెలిపారు. అయితే సీసీటీవీ ఫుటేజీలోని వ్యక్తి.. అంతకుముందు స్వాతిని కొట్టిన వ్యక్తి ఒక్కరే కాదని కూడా ఆయన అంటున్నారు. హత్య జరిగిన సమయంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్ కు కొంచెం దూరంలో ఉన్నానని తమిళరసన్ తెలిపారు. తాను అక్కడికి వెళ్లేసరికి స్వాతి చనిపోయిందని, ఈ హత్యతో తాను చాలా షాక్ కు గురయ్యానని, తర్వాత రైల్లో అక్కడి నుంచి వెళ్లిపోయానని ఆయన వివరించారు. స్వాతిని అంతకుముందు నుంగంబాక్కం రైల్వేస్టేషన్ లోనే ఓ వ్యక్తి 4, 5 సార్లు చెంపదెబ్బలు కొట్టాడని, ఈ విషయం ఎవరితోనైనా చెప్పడానికి భయపడ్డానన్నారు.

ఇక హంతకుడ్ని పట్టుకునేందుకు 40 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్వాతికి చెందిన వ్యక్తిగత, అలాగే ఆఫీసు కంప్యూటర్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే హత్య జరిగి వారం రోజులైనా దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దీంతో సహజంగానే పోలీసులపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసుని నీరుగారుస్తున్నారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న తాము త్వరలోనే ఈ మిస్టరీ ఛేదిస్తామని పోలీసులు అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.

ఇది కూడా చూడండి: ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు

English summary

Chennai police release New CCTV footage of swathi murderer suspect.