యూట్యూబ్‌లో సరికొత్త ఫీచర్‌  'చాటింగ్'

New Chatting Feature In Youtube

11:48 AM ON 16th May, 2016 By Mirchi Vilas

New Chatting Feature In Youtube

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్‌ డెస్క్‌టాప్‌.. మొబైల్‌ అప్లికేషన్లతో కావల్సిన వీడియోలను అందించే సెర్చింజన్‌గా ఉపయోగపడుతోంది. తాజాగా నెటిజన్లను ఆకట్టుకునేందుకు యూట్యూబ్‌లో మరో సరికొత్త ఫీచర్‌ వస్తోంది. వీడియోలను వీక్షించడంతోపాటు..యూట్యూబ్‌ నుంచే స్నేహితులతో ఛాటింగ్‌ కూడా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి:బన్నీ మళ్ళీ ఫైర్ అయ్యాడు

యూట్యూబ్‌లో నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునో.. వీడియో లింక్‌ను వాట్సప్‌.. జీమెయిల్‌లో షేర్‌ చేసుకునే వీలుంది. కానీ.. త్వరలో అందుబాటులోకి తేనున్న మెసేజింగ్‌ ఫీచర్‌తో యూట్యూబ్‌లోనే సన్నిహితులకు.. స్నేహితులకు నచ్చిన వీడియోలను షేర్‌ చేసుకోవడంతోపాటు.. మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చట.

ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ సరికొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్‌.. ఐఫోన్‌ వినియోగదారులకు పూర్తిస్థాయి వెర్షన్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు యూట్యూబ్‌ వెల్లడించింది. ఈ మెసేజింగ్‌ సదుపాయం వచ్చాక వీడియోలు వీక్షిస్తూ.. ఛాటింగ్‌లు చేస్తూ యూట్యూబ్‌లోనే ఎక్కువ మంది కాలక్షేపం చేసే వీలుంటుందని టెక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ఆ పనులు చేసే దానిలా కనిపిస్తున్నానా?

ఇవి కూడా చదవండి:నిహారిక 'ఒక మనసు' టీజర్

English summary

World's Popular Social Media Platform YouTube to bring a new chatting feature in its Android and iOs apps. This feature was presently in testing stage.