తెలంగాణాలో కొత్త జిల్లాలు.. కొత్త కలెక్టర్లు, ఎస్పీలు..

New collectors and sp's for telangana

02:24 PM ON 12th October, 2016 By Mirchi Vilas

New collectors and sp's for telangana

కొత్త జిల్లాల ఏర్పాటుతో మాంచి ఊపుమీదున్న తెలంగాణ సర్కారు అదే జోరులో కొత్త జిల్లాలకు ఎస్పీలు, కలెక్టర్లను ఖరారు చేసింది. కొత్త జిల్లాల్లో కొత్త పాలనకు అనుగుణంగా ప్రభుత్వం.. కొత్త కలెక్టర్లనూ నియమించింది. పాత జిల్లాల కలెక్టర్లలో నలుగురిని మినహా మిగిలిన వారిని బదిలీ చేసింది. వారి స్థానంలో.. ఇప్పటిదాకా జాయింట్ కలెక్టర్లు(జేసీలు)గా పనిచేస్తున్నవారితోపాటు జడ్పీ సీఈవోలుగా పనిచేస్తున్న వారినీ కలెక్టర్లుగా నియమించింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను(నాన్ ఐఏఎస్ కేడర్) జేసీలుగా నియామకం జరిపింది. నియామకాల్లో భాగంగా.. రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లను తిరిగి అవే జిల్లాలకు కొనసాగించాలని నిర్ణయించింది.

మహబూబ్నగర్(శ్రీదేవి), కరీంనగర్(నీతూ కుమారి), నల్లగొండ(సత్యనారాయణరెడ్డి), ఆదిలాబాద్(జగన్మోహన), మెదక్(రోనాల్డ్ రాస్), వరంగల్(కరుణ) జిల్లాల కలెక్టర్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. కొత్తగా నియమితులైన కలెక్టర్లలో ప్రస్తుతం అదే జిల్లాల్లో జేసీలుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరిలో ఆమ్రపాలి, శైనీ(రంగారెడ్డి), దేవసేన(కరీంనగర్) డి.దివ్య(ఖమ్మం)లు ఉన్నారు. ఇక మెదక్ జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న వర్షిణిని పెద్దపల్లి కలెక్టర్ గా నియమించారు.

1/3 Pages

తెలంగాణలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు వీరే:

మహబూబాబాద్ - ప్రీతి మీనన్
వరంగల్ అర్బన్ - అమ్రాపాలి
యాదాద్రి - అనితారామచంద్రన్
మెదక్ - భారతి హొలికేరి
ఆచార్య జయశంకర్ - మురళి
జగిత్యాల - శరత్
ఆదిలాబాద్ - జ్యోతి బుద్ధప్రసాద్
జోగులాంబ - రజత్ కుమార్ షైనీ
నిర్మల్ - ఇలంబర్తి
ఆసిఫాబాద్ - చంపాలాల్
వనపర్తి - శ్వేతామహంతి
నాగర్ కర్నూల్ - శ్రీధర్
వికారాబాద్ - దివ్య
మల్కాజ్ గిరి - ఎం.వి.రెడ్డి
వరంగల్ రూరల్ - ప్రశాంత్
సిద్దిపేట - వెంకట్రామిరెడ్డి
సిరిసిల్ల - కృష్ణ భాస్కర్
కరీంనగర్ - సర్ఫరాజ్ అహ్మద్

English summary

New collectors and sp's for telangana