రూ. 74.5 లక్షల కొత్త నోట్లు స్వాధీనం!

New currency 74.5 lakhs was possessioned

03:10 PM ON 5th December, 2016 By Mirchi Vilas

New currency 74.5 lakhs was possessioned

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నా, పైరవీకారుల హవాకు మాత్రం హద్దు లేదన్నట్లు యవ్వారం నడుస్తోంది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలలో రూ.74.50 లక్షల కొత్త కరెన్సీని పట్టుకున్నారు. బెంగళూరు నగరం మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుంచి వచ్చిన ఆల్టోకారులో ఈశ్వరప్ప నుంచి రూ.12.10 లక్షల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కారు ద్వారా కొత్త నోట్ల రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు మహదేవపుర పోలీసులు పెట్రోల్ బంక్ వద్ద మారుతి ఆల్టో కారును సోదా చేసి ఎటువంటి వివరాలు లేని రూ.12.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

1/4 Pages

అలాగే నగరంలోని హెబ్బాళ ప్రాంతం బాప్టిస్ట్ ఆసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ కు చెందిన మోహన్, శ్రీధర్ ల కారు నుంచి 18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 2వేల నోట్ల కరెన్సీ రూ.10 లక్షలు కాగా, మిగిలిన మొత్తం 100, 50 రూపాయల నోట్లుగా గుర్తించారు.

English summary

New currency 74.5 lakhs was possessioned