ఫేస్ బుక్ లో మరిన్ని ఎమోషన్స్..

New Emotions in Facebook

05:18 PM ON 28th January, 2016 By Mirchi Vilas

New Emotions in Facebook

ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. తమ అనుభవానలు, భావాలు సులువుగా వ్యక్తపరిచే వేదికగా సోషల్ మీడియా మారిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ తమ యూజర్లకు మరింత బాగా భావాలు వ్యక్తీకరించేందుకు చర్యలు చేపట్టింది. ఫేస్‌బుక్‌ పోస్ట్‌కు లైక్‌, కామెంట్‌, షేర్‌ బటన్‌లతో పాటు మరో ఆరు ఎమోషన్స్‌తో కొత్త బటన్స్‌ చేర్చనుంది. త్వరలోనే ఈ కొత్త ఎమోషన్‌ బటన్స్‌ ఫేస్‌బుక్‌లో చేరిపోతాయని సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. కోపాన్ని తెలిపేందుకు angry,బాధకు సూచికగా sad,ఆశ్చర్యానికి wow, సంతోషానికి haha, సరదాగా ఏడిపించినప్పుడు yay, ప్రేమకు సూచికగా love అనే సింబల్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఫేస్‌బుక్‌ పోస్ట్‌కు లైక్‌ మాత్రమే కాకుండా వినియోగదారులు తమ ఎమోషన్స్‌ తెలియజేసేలా ఈ సదుపాయం తీసుకువస్తున్నట్లు జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. ఫేస్‌బుక్‌ ఈ కొత్త ఎమోషన్స్‌ను చిలీ, ఫిలిప్పీన్స్‌, పోర్చుగల్‌, ఐర్లాండ్‌, స్పెయిన్‌, జపాన్‌, కొలంబియాలలో పరీక్షిస్తోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

English summary

Worlds popular social networking site facebook was going to introduce six new smiley's like Love,Haha,Yay,Wow,Angry,Sad. Presently facebook was testing these new emotions in Chile,Philippines,Portugal, Ireland,Spain,Japan Colombia Countries