'యాపిల్‌' కోసం ఫేస్‌బుక్‌ కొత్తయాప్‌

New Facebook App For Apple Users

10:48 AM ON 12th January, 2016 By Mirchi Vilas

New Facebook App For Apple Users

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ , సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్‌ ఇప్పుడు యాపిల్‌ వినియోగదారుల కోసం సరికొత్త మెసెంజర్‌ యాప్‌ను తయారు చేస్తోంది. మేక్‌ ఆపరేటింగ్‌ సిస్టం వినియోగదారులు విండోస్‌ యూజర్ల మాదిరిగానే నేరుగా చాట్‌ చేసుకునే అవకాశం దీనివలన కలుగుతుంది. . ఇందులో రీసెంట్‌, గ్రూప్స్‌, పీపుల్‌,సెట్టింగ్స్‌ అనే ట్యాబ్‌లను ఉపయోగిస్తున్నట్లు ఫేస్‌బుక్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. వినియోగదారుడు ఉపయోగించే ఫొటో ఆధారంగా ఆన్‌లైన్‌లో ఉన్న స్నేహితుల సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. అయితే దీనిని ఎప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేస్తారన్న విషయం ఇంకా వెల్లడించలేదు. యాపిల్ వినియోగదారులూ సిద్ధంగా వుండండి.

English summary

Facebook is going to release a facebook mobile app for iOS users.This was said by one of the facebook official but he did not said that when this new facebook app is going to release