ఫేస్ బుక్ యూజర్లకు సరికొత్త ఫీచర్!

New Facebook Features

10:45 AM ON 16th September, 2016 By Mirchi Vilas

New Facebook Features

సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతూ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందిస్తున్న ఫేస్ బుక్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను భారత యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. దేశంలో రెండో అతిపెద్ద సోషల్ మీడియాగా వున్న ఫేస్ బుక్ ఇప్పటివరకూ అమెరికా, ఇంగ్లండ్ లలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ను భారత్ లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఓసారి ఫేస్ బుక్ లోకి వచ్చినవారు వీలైనంత ఎక్కువ సేపు అందులో గడపాలనే ఉద్దేశంతో ‘గ్రూప్స్ డిస్కవర్’ ఫీచర్ ను యూజర్లకు పరిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ మూడోది కావడం విశేషం.

ఫేస్ బుక్ హోంపేజీలో ‘ఫైండ్ గ్రూప్’ పేరుతో డిస్కవర్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. బ్రౌజర్ కు సంబంధించిన గ్రూపులతోపాటు 25 రకాల కేటగిరీలు అందులో అందుబాటులో ఉంటాయి. పేరెంటింగ్, క్రీడలు, ఆహారం, ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్, జంతువులు, పెంపుడు జంతువులు, అలవాట్లు, హాలీడే, ట్రావెల్, ఎడ్యుకేషన్ తదితర కేటగిరీలు ఉంటాయని ఫేస్ బుక్ చెబుతోంది.

ప్రతీనెల 80 మిలియన్ల మంది భారతీయులు ప్రతీనెల గ్రూపులు ఉపయోగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మంది ప్రజలు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్నట్టు ఫేస్ బుక్ పేర్కొంది. 155 మిలియన్ల మంది ప్రతీనెల ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉంటున్నట్టు తెలిపింది. గ్రూప్స్ కోసం ఫేస్ బుక్ కొన్ని కొత్త ఫీచర్లు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా కొన్ని కామెంట్లకు నేరుగా సమాధానం ఇవ్వడం, సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఫైల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం వంటి ఫీచర్ ను తీసుకొచ్చింది. తాజా ప్రవేశపెట్టిన ఫీచర్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఫేస్ బుక్ గ్రూప్స్ ప్రొడక్ట్ మేనేజర్ ఆదిత్య వైద్య ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్స్ వస్తాయని కూడా చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: ఆ సీన్స్ పై రాధిక గరం గరం ...

ఇది కూడా చూడండి: ఓనమ్ వేడుకల్లోనూ ఫోర్న్ స్టార్స్

ఇది కూడా చూడండి: వందేళ్ల వయసులోనూ సుమ బామ్మ స్పీడు (వీడియో)

English summary

This feature is currently available in United States and England. Now it is introduced to India.