వీళ్ళు ... ఎపి క్యాబినెట్ లోకి వచ్చేస్తున్నారట

New Faces To Appear In AP Cabinet

10:46 AM ON 10th September, 2016 By Mirchi Vilas

New Faces To Appear In AP Cabinet

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన టిడిపి ప్రభుత్వం వచ్చాక క్యాబినెట్ ఏర్పడినా, విస్తరణ మాత్రం ఇంతదాకా జరగలేదు. ఇక క్యాబినెట్ పునర్వ్యవస్తీకరణ త్వరలోనే ఉంటుందని కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. దసరా తర్వాత జరుగబోయే ఎపి క్యాబినెట్ రీ షఫ్లింగ్ లో ఐదుగురు కొత్తవాళ్లకు అవకాశం దక్కనుందని సమాచారం.

మహిళా ఎం ఎల్ ఏ అనిత, వైసిపి నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి, ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ ఎం ఎల్ ఏ బొండా ఉమ, యువనేత నారా లోకేష్ లకు కేబినెట్ లో చోటు కల్పిస్తారని అంటున్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజాపై వీరోచిత పోరాటం చేసిన అనిత కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఎసి ఛైర్మన్ పదవినికూడా వదులుకుని వచ్చిన భూమా నాగిరెడ్డి, ఇటీవల పార్టీ వాణిని గట్టిగా వినిపిస్తూ కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా ఉమ, ఇక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తోన్న లోకేష్ ను తీసుకోవడం ఖాయం అని అంటున్నారు. లోకేష్ ని ప్రభుత్వంలోకి తీసుకోవాలని చాలా కాలంగా తెలుగుతమ్ముళ్లు చేస్తున్న డిమాండ్ తో ఈ దఫా మంత్రివర్గంలో స్థానం పొందబోతున్నారన్నది విశ్వసనీయవర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక ఐదో వ్యక్తి ఎవరనేదానిపై త్వరలోనే క్లారిటీ రావచ్చు.

ఇవి కూడా చదవండి:తాప్సిని వెంటాడి వేధించిన సైకో ...

ఇవి కూడా చదవండి:ప్యాకేజీపై పంఛ్ పేలింది

English summary

MLA's Anitha, Bhuma Nagi Reddy, Bonda Uma and Chandrababu Naidu's son Nara Lokesh to get chance in A.P Cabinet. Recent days these were Succeeded to impresss Telugu Desham Party Chief and AP CM Nara Chandrababu Naidu.