కొత్త ఫీచర్లతో టంబ్లర్ యాప్‌

New Feature in Tumblr ios app

06:05 PM ON 12th December, 2015 By Mirchi Vilas

New Feature in Tumblr  ios app

ఐఓఎస్ యూజర్ల కోసం సోషల్ షేరింగ్ యాప్ టంబ్లర్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మల్టీమీడియా మెసేజ్‌లు, బ్లాగ్ పోస్టులు తదితర అంశాలను ఈ యాప్ ద్వారా షేర్ చేసుకునేందుకు ఇప్పటి వరకు వీలుంది. అయితే ఇప్పుడు ఐఓఎస్ కోసం లైవ్ ఫొటోస్, 3డీ టచ్ సౌకర్యాలను కూడా షేర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్త అప్‌డేట్‌తో ఐఫోన్లకు లైవ్ ఫొటోస్ ఫీచర్‌ను అందిస్తున్న మొదటి సోషల్ నెట్‌వర్క్‌గా టంబ్లర్ రికార్డు సృష్టించింది. ఈ ఫీచర్ కొత్త ఐఫోన్లు ఉన్న యూజర్లకే కాకుండా పాత ఐఫోన్లకు కూడా అందుబాటులో ఉంది. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ యూజర్ల కోసం దీన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దారు. అలాగే 3డీ టచ్ ఫీచర్‌తో టంబ్లర్ పోస్టులను యూజర్లు ప్రివ్యూ చూడవచ్చు. ఈ యాప్‌కు చెందిన లేటెస్ట్ వెర్షన్‌ను ఐఓఎస్ యూజర్లు ఇప్పుడు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ట్రై చేసేయండి.

English summary

The popular blogging platform Tumblr that allows users to share multimedia and other content in the form of blog posts, has rolled out an update for iOS users adding support for Live Photos, 3D Touch, and more