వాట్స్ ఆప్  కొత్త ఫీచర్

New Feature In WatsApp

06:35 PM ON 9th November, 2015 By Mirchi Vilas

New Feature In WatsApp

మన ఫోన్లోని వాట్స్ ఆప్ డేటా ను కంప్యూటర్ లోకి తెచ్చుకోవాలాంటే అనేక పద్దతులు అనుసరించి తెచ్చుకోవడం కాస్త ఇబ్బందనే చెప్పాలి . ఈ ఇబ్బందిని అధిగమించదానికి వాట్స్ ఆప్ ఓ కొత్త పద్దతిని ప్రవేశ పెట్టింది. ఆండ్రా యాడ్ స్మార్ట్ ఫోన్లో వాట్స్ ఆప్ లో మనం జరిపే సంభాషణలు , మనకి వచ్చే- మనం ఇతరులకి పంపే ఫోటోలు , వీడియోలు, స్వర సంభాషణలు ఇలా ప్రతిదీ సైజ్ లిమిట్ అనేది ఏమి లేకుండా మన గూగుల్ డ్రైవ్ ఎకౌంటులోకి బ్యాకప్ చేసుకోవచ్చని వాట్స్ ఆప్ తెలిపింది. అచ్చం ఇలాగే ఐఫోన్ వినియోగదారులు కుడా తమ సమాచారాన్ని ఐ-క్లౌడ్ లో బ్యాకప్ చేసుకోవచ్చు.

ఈ కొత్త సౌకర్యం వల్ల మన ఫోన్ లోని డేటాను సులభంగా బ్యాకప్ చేసుకునే వీలుందని , ఒకవేళ మన ఫోన్ పోయిన సరే మన వాట్స్ ఆప్ లోని ముఖ్యమైన సమాచారాన్ని తిరిగిపొందే అవకాశం ఉంటుందన్న మాటా.

English summary

New Feature In WatsApp