కొంగొత్తగా గూగుల్ క్రోమ్..

New Features in Google Chrome

12:11 PM ON 7th March, 2016 By Mirchi Vilas

New Features in Google Chrome

ప్రముఖ ఇంటర్నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. విండోస్, ఓఎస్ ఎక్స్, లైనక్స్ యూజర్ల కోసం ఈ బ్రౌజ‌ర్ ను రిలీజ్ చేసింది. దీన్ని ఇప్పుడు ఆయా ప్లాట్‌ఫాంల వినియోగదారులు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త వెర్షన్‌లో వెబ్ పేజీలను స్మూత్‌గా స్క్రోల్ చేసుకునేందుకు వీలుంది. దీంతోపాటు దాదాపు 26కు పైగా సెక్యూరిటీ ఫిక్స్‌లను అందిస్తోంది. ఇంటర్నెట్ స్పీడ్‌ను బట్టి నెట్ వినియోగదారులకు లైట్ వెర్షన్ వెబ్ పేజీలను అందించేందుకు వీలుగా వెబ్‌సైట్ల యజమానులకు కొత్త రకం సాఫ్ట్‌వేర్ ఏపీఐలను అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా ఆయా సైట్లలో ఉండే ఆడియో, వీడియో, ఫ్లాష్ తదితర ఫైల్స్‌ను ఓపెన్ చేయకుండా బేసిక్ వెబ్ పేజీని మాత్రమే ఓపెన్ చేసేందుకు వీలుంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న పీసీ యూజర్లకు క్రోమ్‌కు చెందిన ఈ కొత్త వెర్షన్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని గూగుల్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెర్షన్ పీసీ యూజర్లకు మాత్రమే లభిస్తుండగా త్వరలోనే దీనిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందించనున్నారు.

English summary

New features introduced in Google Chrome that allows the user interface change puts all of the extension icons to the right of the omnibar. Ones you have hidden get put into the hamburger menu-unlike before, you can't hide the extension icons completely.