కొత్త కొత్తగా గ్జెండర్ ఫైల్ షేరింగ్ యాప్..

New Features In Xender App

03:25 PM ON 25th January, 2016 By Mirchi Vilas

New Features In Xender App

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫైల్ షేర్ చేసుకోవడం సర్వసాధారణం. వేరే డివైస్‌కు లేదా కంప్యూటర్‌కు ఫైల్స్‌ను పంపేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. గ్జెండర్ ఫైల్ ట్రాన్స్‌ఫర్, షేరింగ్ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ యాప్ కొత్త వెర్షన్‌ను ఇప్పుడు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.3 ఆపైన వెర్షన్ కలిగిన వినియోగదారులు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా డాక్యుమెంట్స్, మ్యూజిక్, పిక్చర్స్, వీడియోలు, యాప్స్‌ను యూజర్లు షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా డివైస్‌లలో ఈ యాప్ ఉండడంతోపాటు వైఫై కచ్చితంగా ఆన్‌లో ఉండాలి. ఇది ఐఓఎస్ డివైస్‌లోనూ పనిచేస్తుంది. యూఎస్‌బీ కేబుల్, ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండానే దీని ద్వారా ఫైల్ షేరింగ్ సాధ్యమవుతుంది. ఒక డివైస్ నుంచి ఒకే సారి దాదాపు 4 డివైస్‌లకు ఆయా ఫైల్స్‌ను షేర్ చేయవచ్చు. దీంతోపాటు ఫైల్ షేరింగ్‌కు సంబంధించిన ఇతర ఫీచర్లు కూడా ఇందులో లభిస్తున్నాయి.

English summary

Xender app mobile app which is used to share our files in our phone with another phone was recently added some new features to it.This app also works in iOS devices too